దైవాలరావూరు :: స్వాగతం సుస్వాగతం

దైవాలరావూరు

స్వాగతం సుస్వాగతం

జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపీగరీయసీ అన్నారు మన పెద్దలు.అంటే మనం పుట్టి పెరిగిన ఊరు స్వర్గంతో సమానమన్నమాట.కన్నతల్లి మీదా,పుట్టి పెరిగిన ఊరు మీదున్న మమకారం మన కట్టె కాలే వరకూ మనల్ని అంటి పెట్టుకునే ఉంటాయి.దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నాసరే మన ఊరిని ఒక్కసారి తలుచుకుంటే చాలు తియ్యటి జ్ఞాపకాలు కల్లముందు తేలియాడతాయి.ఆ కమ్మటి జ్ఞాపకాలను,ఆ మధుర స్మృతులను పదిమందితో పంచుకోవాలని ప్రతీ ఒక్కరిలోనూ ఉంటుంది. అలా వచ్చిన ఆలోచనకు కార్యరూపమే ఈ దైవాలరావూరు.కామ్ వెబ్ సైట్. మన గ్రామం గురించి తెలుగులో అందరికీ సమాచారం అందివ్వాలన్నదే మా ఒక్క ప్రధాన ఆశయం.మీరూ ఈ మహా యజ్ఞంలో పాలుపంచుకుని తలో చెయ్యూ వేసి మన ఊరి గురించి సమాచారం మాకు అందించి మాకు ప్రేరణగా నిలుస్తారని ఆశిస్తున్నాము.

దైవాలరావూరు (గ్రామ సంకేత భాష-7), కొరిశపాడు (మండలం సంకేత భాష-27), ప్రకాశం (జిల్లా సంకేత భాష-8), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం.
సమన్వయ: 15°42'35"N 80°3'23"E
సమీప నగరాలు/మున్సిపాలిటీలు: ఒంగోలు మరియు అద్దంకి


మన గ్రామం 100 మీటర్ల ఎత్తు నుంచి ఇలా ఉంటుంది.


మన గ్రామం 100 మీటర్ల ఎత్తు నుంచి

Mahesh Bokkisam